Wednesday, December 31, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపేదల సేవలో కూటమి ప్రభుత్వం|

పేదల సేవలో కూటమి ప్రభుత్వం|

*పేదల సేవలో కూటమి ప్రభుత్వం*
*పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందచేత*
*18వ డివిజన్‌లో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*
*ఫింఛన్ల పంపిణీలో పాల్గొన యాదవ కార్పోరేషన్‌ చైర్మన్‌ నరసింహాయాదవ్‌*
***
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి పేదల సేవలోనే ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు.

బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్‌ సిద్ధం కృష్ణారెడ్డి రోడ్డులో లబ్ధిదారులకు యాదవ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ నరసింహయాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ స్వయంగా ఫించన్లు అందచేశారు. 18వ డివిజన్‌ లో మరణించిన తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తల కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ రూ.20 వేలను తన సొంత నిధులతో ఆర్థిక సహాయాన్ని అందచేశారు. సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డికి రూ.10 వేలు, రాగం దుర్గా ప్రసాద్‌కు రూ.10 వేలు వారి కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ స్వయంగా అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికైన మొదటి రోజు నుంచి పేదల సేవలోనే ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికైన రోజు నుంచి పేదలకు మేలు చేసే విధంగానే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. జనవరి 1వ తేదిని అందరూ పండుగ వాతావరణంలో.

జరుపుకుంటారని అందువల్ల ఒక రోజు ముందునేగా అంటే డిసెంబర్‌ 31వ తేదినే లబ్థిదారులకు పించన్లు అందచేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రూ. 57వేల కోట్లను ఫించన్ల రూపంలో పేదలకు అందచేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా అత్యధికంగా ఫించన్లు ఇవ్వడం లేదన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో రూ.10 వేల కోట్ల లోపునే ఫించన్లు.

కేటాయిస్తున్నారన్నారు. మన ఒక్క రాష్ట్రంలోనే నెలకు రూ.4 వేలు ఫించనుగా ఇంటికి వెళ్ళి ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్థికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలన చేస్తున్నారని చెప్పారు.

గుంతలు లేని రహదారులను చూడాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టి రహదారులపై గుంతలను సరిచేయించారన్నారు. ప్రజలు ఈ విషయాలన్నింటిని పరిశీలించి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన యాదవ కార్పోరేషన్‌ చైర్మన్‌ వ్యక్తిగత పనులపై నగరానికి వచ్చి ఆయన ఇక్కడ జరిగిన ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హాయంలో చిన్నపాటి కారణాలను చూపించి తొలగించిన
ఫించన్లను కూడా పరిశీలించి అర్హులైన వారికి ఫించన్లు ఇచ్చే శక్తిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డెప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు.

ఈ కార్యక్రమంలో కొక్కిర తిరుపతయ్య, వేముల దుర్గారావు, మైలుమూరు పీరుబాబు, గోగుల ఏసు, పగడాల వెంకటేశ్వరరెడ్డి, తలపాటి ప్రసాద్, బలగాని శ్రీను, అంబటి కాశి, పత్తి రామారావు, గోగుల గోపి, గండ్ర రాజు, అమ్మలపూడి దుర్గమ్మ, వేముల దుర్గ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments