సీఎం చంద్రబాబు జీవితమే ఒక చరిత్ర…
పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి
ఓల్డ్ సిటీను న్యూ సిటీగా మార్చేందుకు కృషి
ఏపికి 15 ఏళ్లు సీఎంగా చంద్రబాబు రికార్డ్ పుస్తకావిష్కరణ లో ఎంపీకేశినేని శివనాథ్ వెల్లడి
విజయవాడ : సీఎం చంద్రబాబు ముందుచూపు రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడపిస్తుంది. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పరిపాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.
శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాయన శేఖర్ బాబు రచించిన ఆంధ్రప్రదేశ్ 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా రికార్టు సృష్టించిన నారా చంద్రబాబు నాయుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గం చిట్టి నగర్ సెంటర్ వద్ద గల నగరాలు సీతారామస్వామి , శ్రీ మహాలక్ష్మీ అమ్మవార్ల దేవస్థానం కళ్యాణమండపంలో మంగళవారం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, జనసేన విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు లతో కలిసి ఆంధ్రప్రదేశ్ 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా రికార్టు సృష్టించిన నారా చంద్రబాబు నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. విజనరీ లీడర్ సీఎంచంద్రబాబు పై పుస్తకం రచించిన రచయిత భాయన శేఖర్ బాబుకి అభినందనలు తెలుపుతూ సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పై పుస్తకం రచించిన భాయన శేఖర్ బాబు ను అభినందించారు. దేశంలో ఆదర్శవంతులుగా వున్న నాయకుల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఒకరని తెలిపారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేసి ఎంతోమంది ఆదర్శంగా.
మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పనికి ఆహార పధకం, డ్వాక్రా సంఘాలు వంటి వాటిని ఎన్నో పథకాలను ఆదర్శంగా తీసుకుని అమలు చేయటం సీఎ చంద్రబాబు నాయుడు విజన్ కి నిదర్శనమన్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ద పెట్టారని తెలిపారు. విజయవాడ ఓల్డ్ సిటీని న్యూ సిటీగా అభివృద్ది చేసేందుకు పూర్తి మద్దతు ఇచ్చారని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఎన్.వి.రావు, నగరాలు సీతారామస్వామి , శ్రీ మహాలక్ష్మీ అమ్మవార్ల దేవస్థానం ప్రధాన కార్యదర్శి మరుపిళ్ల హనుమంతురావు, ట్రేజరర్ పిళ్లా శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటేశ్వరరావు, టిడిపి సీనియర్ నాయకులు కోగంటి రామారావు, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుఖాసి కిరణ్, కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, గొల్లపూడి
మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, నియోజకవర్గ ఐటిడిపి అధ్యక్షుడు ఎమ్.చైతన్య, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.మాధవ, క్లస్టర్ ఇన్చార్లు ధనేకుల సుబ్బారావు, డి.ప్రభుదాసు, కో-క్లస్టర్ కొప్పుల గంగాధర రెడ్డి, డివిజన్ అధ్యక్షులు చిన్న సుబ్బయ్య, శివశర్మ, కుంచం దుర్గరావు, నందే విజయలక్ష్మీ, బేవర జోగేష్, డివిజన్ కార్యదర్శులు ఈశ్వరరావు, ధనాల శ్రీను, కె.సాంబశివయ్య, దుర్గగుడి ఆలయ బోర్డ్ మెంబర్ సుఖాసి సరిత, , టిడిపి సీనియర్ మహిళ నాయకురాలు బంకా నాగమణి.
గొల్లపూడి ఎ.ఎమ్.సి డైరెక్టర్ మైలపల్లి రాజు, టిడిపి నాయకులు పట్నాల హరిబాబు, మైనార్టీనాయకులు ఖాజా, బిసి సెల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తమ్మిన శేఖర్, ఎస్సీ సెల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాలవాయి దాసు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.




