Home South Zone Andhra Pradesh సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్ఓసి పత్రాల అందజేత

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్ఓసి పత్రాల అందజేత

0
1

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలు అందచేత ..

పశ్చిమ నియజకవర్గానికి సంబంధించిన ఇద్దరికీ ఎల్వోసీ పత్రాలను ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో అంద చేశారుమ్

46 వ డివిజన్ కు చెందిన 16 సంవత్సరాల బత్తుల జీవన్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.. అతని తలకు తీవ్ర గాయలవ్వడంతో వైద్యం ఖర్చుల కోసం స్థానిక కూటమి నాయకుల ద్వారా ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి బాధితునికి వైద్య ఖర్చుల నిమిత్తం 1.20,000/_ రూపాయల తక్షణ సాయం అందించాలంటూ సీఎం సహాయ నిధికి లేఖను రాసారు.

. అదే విధంగా పాత బస్తీ 51 వ డివిజన్ కు చెందిన 55 ఏళ్ల గూడెల తవుడు కిడ్నీ వ్యాధి కారణంగా అనారోగ్యంతో బాధ పడుతోంది.. బాధితుల కుటుంబ సభ్యులు కూటమి నాయకుల ద్వారా ఎమ్మెల్యే సుజనా చౌదరి.

కార్యాలయాన్ని సంప్రదించారు.. మేజర్ సర్జరీ తో పాటు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే కార్యాలయం అండగా నిలిచింది.. వైద్య ఖర్చుల కోసం 5,00,000/_ రూపాయలు మంజూరు చేయాలంటూ ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం రిలీఫ్ ఫండ్ కు లేఖను రాసారు.. భాదితుడి మెరుగైన వైద్యం కోసం భవానీ పురం లోని ఎన్డీఏ కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు ఎల్ ఓ సీ పత్రాలను అంద చేశారు..

51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్, బంకా నాగమణి, విజయవాడ తెలుగుదేశం పార్లమెంటు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోగంటి రామారావు, తెలుగుదేశం పార్టీ 46 వ డివిజన్ అధ్యక్షుడు లోకేష్, యం యల్ ఏ కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ గారు… సుజనా మిత్రలు, మరియు కూటమి నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు..

NO COMMENTS