Home South Zone Andhra Pradesh 12 కోట్లు సహాయనిధి మంజూరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

12 కోట్లు సహాయనిధి మంజూరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

0
1

ఇప్పటివరకు రూ.12 కోట్ల సీఎం సహాయనిధి మంజూరు.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2025.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మైలవరం నియోజకవర్గంలోని 1420 మంది లబ్ధిదారులకు రూ.12 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్ లను మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన బుధవారం లబ్దిదారులకు అందజేశారు. పేదల ఆరోగ్యానికి అండగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తుందన్నారు. భారీగా సీఎంఆర్ఎఫ్ మంజూరు చేసిన సీఎం చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి లబ్దిదారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేత.

నూతన ఏడాదిని పురస్కరించుకుని మైలవరం పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, మిఠాయిలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు బుధవారం అందజేశారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. వారంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS