రేపు అద్దంకి పట్టణం నందు అద్దంకి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం
బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల : అద్దంకి పట్టణం నందు అద్దంకి రెవిన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
అద్దంకి పట్టణం లో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను అద్దంకి రెవిన్యూ డివిజనల్ కార్యాలయంగా మార్పు చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధవారం అద్దంకి పట్టణం లో అద్దంకి రెవిన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు..
#నరేంద్ర




