ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు డిసెంబర్ 20 నుంచి నెల రోజుల పాటు ‘డోర్ డెలివరీ మాసోత్సవాలు’ నిర్వహిస్తోంది.
ఇంటి వద్దకే కొరియర్లు, పార్సిల్లు అందించే ఈ సేవలను సులభతరం చేయడానికి ప్రత్యేక బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10 కిలోమీటర్ల లోపు 50 కిలోల వరకు ఉచిత డెలివరీతో పాటు, 24-48 గంటల్లో డెలివరీ లక్ష్యంగా సేవలందిస్తున్నారు.




