కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు సిటీని సర్వనాశనం చేశారని మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అనుమతి లేకుండానే శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ కూర్చి వేశారని, అద్భుతమైన కోర్ సెంటరను సేదు బంద్ కింద తొక్కేశారని ఆరోపించారు.
కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా భూసేకరణ చేశారని ఫ్లైఓవర్ కూల్చివేసిన తర్వాత అనుమతులు అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ్లైఓవర్ కూల్చివేతతో రాకపోకలకు ప్రజలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గుంటూరు సిటీకి జరుగుతున్న అన్యాయాలపై తను గళం విప్పితే మహిళలు చేత తనను తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి ప్రభసాన్ని చాలా అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కానీ బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.




