ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద ప్రసాదాలు పంపిణీ
మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో భక్తులకు ప్రసాదాల పంపిణీ
10 వేల మందికి పైగా ప్రసాదాలు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు
ప్రతి ఏటా స్థానిక నాయకులతో ప్రసాదాలు పంపిణీ చేయిస్తున్న మంత్రి నారా లోకేష్
మంగళగిరి టౌన్: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద ఉత్తర ద్వార దర్శనానికి వచ్చిన భక్తులకు మంత్రి నారా లోకేష్ సహకారంతో టీడీపీ నాయకులు మంగళవారం ప్రసాదాలు పంపిణీ చేశారు.
తెల్లవారుజామున నుంచే స్వామి దర్శనంకు వచ్చిన 10 వేల మందికి పైగా భక్తులకు ప్రసాదాలు అందజేశారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో ప్రతి ఏటా భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ కూటమి పాలనలోనే ఆలయాలు పూర్వవైభవం సంతరించుకుంటున్నాయని అన్నారు.
చరిత్రలో నిలిచిపోయేలా శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి మంత్రి నారా లోకేష్ ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. లక్ష్మినరసింహస్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షిచారు.
ప్రసాదాలు పంపిణీ చేసిన వారిలో మంగళగిరి పట్టణ అధ్యక్షులు పడవల మహేష్, రాష్ట్ర పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వాకా మాధవరావు, గోవాడ దుర్గారావు, వంగర సదాశివరావు, నల్లగొండ పరమేశ్వరరావు, బైరుబోయిన శ్రీనివాస్ యాదవ్, గోసాల రాఘవ, దివి లక్ష్మి, నల్లగోర్ల శివరామకృష్ణ, బాపనపల్లి వాసు, గంజి లక్ష్మయ్య, ఆకురాతి లక్ష్మణ్, ఇండ్ల రజనీ, గోవాడ వెంకట లక్ష్మి, కొత్త శ్రీనివాసరావు, తెల్లమేకల నాగేశ్వరరావు, చావలి ఉల్లయ్య యాదవ్, అవ్వారు సుబ్బారావు, పిన్నబోయిన నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.




