మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సుచిత్ర సెంట్రల్ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు.
కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన రైల్వే స్టేషన్ మొదలు పెట్టి సంవత్సరన్నర అయినా నిరుపయోగంగా మారడం పట్ల ఎంపి. ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ స్టేషన్ పూర్తి స్థాయిలో ప్రజలకు వినియోగంలోకి రావడానికి ఏం చేయాలో నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇక్కడ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఉందని ప్రజలకు తెలియకపోవడం. బస్ స్టేషన్ చాలా దూరం ఉండడం. స్టేషన్ కి రావడానికి సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఎక్కువమంది ప్రయాణికులు రావడం లేదని అధికారులు వివరించారు.
చర్లపల్లి – ఘట్కేసర్,
లింగంపల్లి – రామచంద్రపురం,
రెండు రూట్లలో రైళ్లు నడుస్తున్నాయి.
ఈ మార్గంలో రైళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా పెంచాలని ఉన్నత అధికారులను కోరతామని ఈటల రాజేందర్ తెలిపారు.
ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు సదా కేశవ రెడ్డి ,చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ, మల్ల రెడ్డి,భరత్ సింహ రెడ్డి, సుబ్బా రావు, రాజి రెడ్డి , మల్లికార్జున్ సూర్య, మురళి కృష్ణ, శ్రీధర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju




