పట్టణంలో వేరువేరు కారణాలతో మృతి చెందిన టిడిపి నాయకుల కుటుంబాలను బుధవారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరామర్శించారు. 29వ వార్డులోని 65వ కో – బూత్ ఇంచార్జ్.
టిడిపి నాయకులు అలీ తండ్రి నజీర్ అనారోగ్యంతో మృతిచెందగా.ఆయన మృత దేహానికి పూలమాలతో నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత స్థానిక పిడబ్ల్యుడి కాలనీలో టిడిపి నాయకులు కొండూరు లెనిన్ బాబు మరణించగా.ఆయన చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




