*ఆపదలో ఉన్నవారికి చేయూతగా నిలవడం మానవ ధర్మం*
*-ఖిద్మత్ టీమ్ లీడర్ షేక్ షఫీ*
*మంగళగిరి:*
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం మానవ ధర్మమని ఖిద్మత్ టీమ్ లీడర్ షేక్ షఫీ అన్నారు.నగరానికి చెందిన పలువురు యువకులు ఖిద్మత్ టీమ్ సభ్యుడు సుభాని ఆధ్వర్యంలో సభ్యులుగా చేరారు. భవిష్యత్తులో ఖిద్మత్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో.
ఖిద్మత్ టీమ్ లీడర్ షేక్ షఫీ మాట్లాడుతూ… తమ టీమ్ సభ్యుడు సుభాని ఆధ్వర్యంలో యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకోవడం అభినందనీయమన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి సమాజ సేవకు
ఖిద్మత్ టీమ్ ముందుకు సాగుతుందన్నారు.
ఎంతోమంది నిరుపేదలకు
ఖిద్మత్ టీమ్ కుల, మత, రాజకీయాలకు అతీతంగా అండగా నిలవడంతో పాటు ఆర్థిక సహాయాలను, నిత్యవసర సరుకులను అందజేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో తమ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయనున్నట్లు షఫీ తెలిపారు.




