Home South Zone Andhra Pradesh గుంటూరుపశ్చిమంలో ప్రజా సమస్యల పరిష్కారం|

గుంటూరుపశ్చిమంలో ప్రజా సమస్యల పరిష్కారం|

0
0

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు నిర్వహించారు. ప్రజల సమస్యలు, వారి అర్జీల స్వీకరణ, సత్వర పరిష్కారం ఇవన్నీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న గ్రీవెన్స్ డేలో భాగమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు తెలిపారు.

ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ…
ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ప్రజల అర్జీలు స్వీకరించి, సంబంధిత శాఖలకు అనుసంధానం చేసి, వారికి తక్షణ ఉపశమనం కలిగించేందుకు అన్ని ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తూ.

సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ చేస్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు తెలిపారు.

NO COMMENTS