నిర్మల్ జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలందరికీ శుభం కలగాలని ఆమె ఆకాంక్షించారు.
గడిచిన ఏడాదిలో అందరి సహకారంతో జిల్లా మెరుగైన ప్రగతి సాధించిందని, రాబోయే సంవత్సరంలో మరింత ఉత్సాహంతో పని చేసి నిర్మల్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు.
#saketh




