Friday, January 2, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshడయల్ యువర్ కార్యక్రమం లో పాల్గొన్న కర్నూలు మున్సిపల్ కమిషనర్ |

డయల్ యువర్ కార్యక్రమం లో పాల్గొన్న కర్నూలు మున్సిపల్ కమిషనర్ |

కర్నూలు : సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు ‘డయల్ యువర్ కమిషనర్’కు 34 ఫిర్యాదులుప్రజా సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమంలో వివిధ కాలనీలకు చెందిన 34 ఫిర్యాదులను ఆయన విని, సంబంధిత విభాగధికారులతో సమన్వయం చేసుకుని తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారిస్తూ, నగరపాలక సంస్థ పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం కలిగేలా అధికారులు పనిచేయాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది పనితీరు ఎప్పటికప్పుడు విభాగాధిపతులు పర్యవేక్షించాలని, చట్టపరిధిలో సమస్యల పరిష్కారంలో జాప్యం చేయోద్దని స్పష్టం చేశారు.కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ యన్.చిన్నరాముడు, కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్ బాబు, ఆర్‌ఓలు జునైద్, స్వర్ణలత, ఎంఈ మనోహర్ రెడ్డి, డిసిపి వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ సుబ్బన్న, మంజూర్ బాష, తదితరులు పాల్గొన్నారు.

వచ్చిన విన్నపాల్లో కొన్ని..1. షరీన్ నగర్, రామాలయం లైన్లో సిసి రహదారి నిర్మించాలని భాను ప్రకాష్ విన్నవించారు.2. సంతోష్ నగర్ పంచముఖి నగర్ నందు డబ్లూబియం రహదారి నిర్మించాలని బి.అయన్న కోరారు.3. ఎస్‌ఏపి క్యాంపు తూర్పు ప్రవేశ మార్గం వద్ద అనధికార స్పీడ్ బ్రేకర్లు తొలగించాలని కేశవరావు కోరారు.4. పెద్దపాడు రోడ్డు గీత లక్ష్మి నగర్ నందు వీధి దీపాలు వెలగడం లేదని

చెత్త సేకరించడం లేదని వై.నాగరాజు పేర్కొన్నారు.5. ప్రకాష్ నగర్ సుంకులమ్మ గుడి వద్ద డ్రైనేజీ బ్లాక్ అయిందని ఇశాక్ అహ్మద్ విన్నవించారు.6. రాఘవేంద్ర నగర్ నందు పూడికతీత పనులు చేపట్టాలని ధనుంజయ్ విన్నవించారు.7. విజయ్ లక్ష్మి నగర్ – 2, క్రిష్ణా నగర్ 9/3 వద్ద ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు తొలగించాలని రాముడు, సుబ్రహ్మణ్యం కోరారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments