Home South Zone Telangana పోలీసుల నూతన సంవత్సరం వేడుకలు – బదిరుల పాఠశాల|

పోలీసుల నూతన సంవత్సరం వేడుకలు – బదిరుల పాఠశాల|

0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అభయ అమృత వర్షిణి బదిరుల (చెవిటి మరియూ మూగ) పాఠశాలలో కమ్యూనిటీ అవుట్ రీచ్ మరియు సమ్ములిత చొరవలో భాగంగా గోపాలపురం డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపి)  పి.సుబ్బయ్య విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

మారేడుపల్లి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ ఓ) నోముల వెంకటేష్, సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి, మరియు సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ వేడుకలో మొత్తం 38 మంది పాఠశాల విద్యార్థులు, పాఠశాల నిర్వహకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థుల మధ్యన కేక్ కట్ చేసిన పోలీసు సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏసీపీ మరియు ఇతర పోలీసు అధికారులు విద్యార్థులతో ఆత్మీయంగా సంభాషించి, వారికి ధైర్యాన్ని ఉత్సాహాన్ని అందించారు. విద్యార్థుల మధ్యన సంరక్షణ, మరియు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని వారు నొక్కి చెప్పారు.
తమతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని, ఈరోజును చిరస్మరణీయం చేసినందుకు విద్యార్థులు, మరియు నిర్వాహకులు హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ పోలీసుల మానవీయ కోణాన్ని, మరియు స్నేహపూర్వక విధానాన్ని  (people friendly policing)  చాటి చెప్పేలా ఈ కార్యక్రమం సాగింది.
ఇది పోలీసులకు మరియు ప్రజలకు మధ్య బంధాన్ని బలోపేతం చేసింది.

#sidhumaroju.

NO COMMENTS

Exit mobile version