మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద డిసెంబర్ 27,28 లో కరీంనగర్లో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ లో సత్తా చాటిన మేడ్చల్ జిల్లాకు చెందిన నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యుల బృందం అధ్యక్షులు, వెటరన్ క్రీడాకారుడు మర్రి లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మర్రి లక్ష్మణ్ రెడ్డి కరీంనగర్ లో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ లోని వాకింగ్, రన్నింగ్, జావలిన్ త్రో, లాంగ్ జంప్, హై జంప్ వంటి భాగాలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను పరిచయం చేయగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ క్రీడాకారులను అభినందించారు.
అనంతరం బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. అథ్లెటిక్స్ మనలోని మానసిక ధైర్యాన్ని పెంపొందించడంతో పాటు శారీరకధృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రత్నకుమార్, శ్రీలక్ష్మి, లక్ష్మణ్ రావు, కోశాధికారి డి.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju






