కర్నూలు : కర్నూలు జిల్లా… కర్నూలు జిల్లా జడ్జి , కర్నూలు రేంజ్ డిఐజి గారులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన … డిఐజి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. డీఐజి గా పదోన్నతి స్వీకరించిన…శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. అభినందనలు తెలిపిన…జిల్లా జడ్జి , కర్నూల్ రేంజ్ డిఐజి.కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు ఎస్పీ స్థాయి నుండి డీఐజీ గా ఈ రోజు పదోన్నతి స్వీకరించారు.
ఈ సందర్భంగా గురువారం జిల్లా జడ్జి శ్రీ కబర్థి గారిని , కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ కోయ ప్రవీణ్ ఐపియస్ గారులను డిఐజి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.డీఐజీగా పదోన్నతి స్వీకరించిన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారికి జిల్లా జడ్జి .
కర్నూల్ రేంజ్ డిఐజి అభినందనలు తెలియజేశారు.అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీ విక్రాంత్ పాటిల్ గారిని అడిషనల్ ఎస్పీలు , డీఎస్పీలు, సిఐలు , ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు , డిపిఓ మినిస్టిరియల్ సిబ్బంది , ఇతర శాఖల సిబ్బంది కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ముందుగా ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో డిఐజి శ్రీ విక్రాంత్ పాటిల్ గారు, కర్నూల్ ఏపీఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెట్ శ్రీ దీపికా పాటిల్ ఐపిఎస్ గారు కలిసి కుటుంబ సమేతంగా కేక్ కట్ చేసి స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి , క్యాంపు కార్యాలయంలోని సిబ్బందికి నూతన సంవత్సరo శుభాకాంక్షలు తెలిపారు.




