నగరాల హెల్త్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వాండ్రాసి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చిట్టి నగర్ శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కళ్యాణ మండపం హాల్ నందు నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
నగరాల హెల్త్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నగరాల సామాజిక వర్గంతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారికి వైద్య సేవలు అందించాలని తద్వారా సామాజిక వర్గానికి సమాజంలో అవసరమైన వారందరికీ ఉపయోగపడే విధంగా వాండ్రాశి శ్రావణ్ కుమార్ గారు ముందుకు సాగాలని అందుకు భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా వారిపై ఉండాలని కోరారు.




