Friday, January 2, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండగ 2.0 కు శ్రీకారం |

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండగ 2.0 కు శ్రీకారం |

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండుగ-2.0కు శ్రీకారం*

గ్రామ సీమల అభ్యున్నతికి పవన్ కళ్యాణ్ కృషి:ఎమ్మెల్యే*

రూ.1.90 కోట్లతో ఆరు ప్రధాన రహదారుల నిర్మాణం:ఎమ్మెల్యే*

హైవే అనుసంధాన రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ*

రూ.45లక్షలతో క్లబ్ టూ ఎన్.హెచ్-216 రోడ్డు నిర్మాణం ప్రారంభం*

ఇటీవల చల్లపల్లి ప్రజా దర్బార్ కార్యక్రమంలో రోడ్డు నిర్మాణం కోరుతూ అర్జీ సమర్పించిన నివాసితులు, విద్యార్థులు*

సత్వరమే రోడ్డు మంజూరు చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే*

చిరకాల వాంఛ నెరవేర్చిన ఎమ్మెల్యే బుద్ధప్రసాదుకు నివాసితులు, విద్యార్థుల సత్కారం*

భారీ సంఖ్యలో తరలివచ్చి ధన్యవాదములు తెలిపిన విద్యార్థులు*

చల్లపల్లి:

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గంలో పల్లెపండుగ 2.0 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో ఆర్.అండ్.బీ రోడ్డు వద్ధ నుంచి జాతీయ రహదారి-216 వరకూ కనెక్టివిటీ కోసం నూతన తారు రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే భూమిపూజ చేసి ప్రారంభించారు. పల్లెపండుగ -2.0 కార్యక్రమం ద్వారా ఉపాధి పథకం నిధులు రూ.45లక్షలతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గ్రామ సీమల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మౌళిక సౌకర్యాలు కల్పించి పూర్వపు ఔన్నత్యం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ తన శాఖ ద్వారా తగిన నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. పల్లె పండుగ మొదటి విడతలో పవన్ కళ్యాణ్ సహకారంతో ఉపాధి పథకం నిధులు రూ.31కోట్లతో నియోజకవర్గంలో 50 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. తాజాగా చేపట్టిన పల్లెపండుగ-2 కార్యక్రమం ద్వారా ఉపాధి పథకం నిధులు రూ.కోటీ 90లక్షలతో ఆరు తారు రోడ్లు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రానికి విడుదల అయిన సాస్కి నిధుల నుంచి నియోజకవర్గానికి మంజూరు చేసిన రూ.14.57 కోట్లతో మరో ఆరు తారు రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రధాన రహదారుల నిర్మాణం విస్మరించిన నిర్లక్ష్య ఫలితంగా ధ్వంసమైన అన్ని రహదారులను కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

*నివాసితులు, విద్యార్థుల అభినందనలు*

సుదీర్ఘ కాలంగా తమ రోడ్డు అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న నివాసితులు, రెండు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాదుకు ధన్యవాదములు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చల్లపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నివాసితులు, విద్యార్థులు రోడ్డు నిర్మాణం కోసం అర్జీ సమర్పించగా, తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఈ రోడ్డు చల్లపల్లి – మచిలీపట్టణం ఆర్ అండ్ బీ రోడ్డుకు – జాతీయ రహదారి-216కు అనుసంధాన రహదారిగా వాహనదారులకు, గ్రామస్థులకు, నివాసితులకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే రహదారిగా గుర్తించి, పల్లె పండుగ-2.0 కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో చేపట్టిన ప్రధాన రహదారుల అభివృద్ధి పనుల్లో భాగంగా ఉపాధి నిధులు రూ.కోటీ 90లక్షల నుంచి అత్యధికముగా ఈ రోడ్డుకు రూ.45లక్షలు కేటాయించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాదుకు నివాసితులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియచేసి ఘనంగా సత్కరించారు.

*గోకులం షెడ్డు ప్రారంభం*

పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపురంలో పాడిరైతు కనకమేడల రంగారావు ఉపాధి నిధులు రూ.2,03,000లు సబ్సిడీతో లబ్ధిదారు వాటా రూ.27వేలతో నిర్మించుకున్న గోకులం షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.

కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, టీడీపీ మండల అధ్యక్షులు, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, సర్పంచ్ కొల్లూరి కోటేశ్వరరావు, ఏపీఎస్ ఐడిసీ డైరెక్టర్, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, స్వచ్ఛ ఏపీ డైరెక్టర్ బోలెం నాగమణి, పీఏసీఎస్ చైర్మన్లు యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్ (లంకబాబు), బొందలపాటి వీరబాబు, వైస్ ఎంపీపీ-2 పిట్టి వెంకటేశ్వరమ్మ, ఎంపీటీసీ మాలెంపాటి శ్రీనివాసరావు, మండల కో-ఆప్షన్ సభ్యులు షేక్ నబీఘోరీ, ఏఎంసీ డైరెక్టర్ సూదాని నందగోపాల్, టీసీ అధ్యక్షులు గొరిపర్తి సుబ్బారావు, ప్రముఖులు కొత్తపల్లి భుజంగరావు, గుడిసేవ విష్ణుప్రసాద్, ఎంపీడీఓ ఎంఎం ఆనందకుమారి, పంచాయతీరాజ్ శాఖ డీఈఈ పగడాల సురేష్ బాబు, ఏఈఈ బొప్పన శ్రీనివాసరావు, బీజేపీ మండల అధ్యక్షులు అడపా రవి, కూటమి నాయకులు కనకమేడల వాసు, తోట మురళీకృష్ణ, పిండి శివ సుబ్రహ్మణ్యం, గంగిశెట్టి బాబూ రాజేంద్ర, మిరియాల జితేంద్ర, పంచాయతీ కార్యదర్శి శైలజ, ఉపాధి పథకం ఏపీఓ రాజ్ కుమార్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments