Friday, January 2, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు దరఖాస్తుల ఆహ్వానం |

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు దరఖాస్తుల ఆహ్వానం |

కర్నూలు :
భారత ప్రభుత్వము తపాల శాఖ : కర్నూల్ డివిజన్ కర్నూలు-518001.భారత ప్రభుత్వం తపాలా శాఖలో భాగమైనటువంటి తపాలా జీవిత బీమా మరియు గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు కమిషన్ పద్ధతిన చేయించుటకు డైరెక్ట్ ఏజెంట్లను నియమించుట కొరకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ జనార్దన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు .

అర్హత : పదవ తరగతి పాస్ అయి ఉండాలి, వయసు : 18 తరాల పైబడిన వారందరూ అర్హులే. మాజీ జీవిత బీమా అడ్వైజర్లు, రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులు, నిరుద్యోగ యువతీ యువకులు, గృహిణులు, స్వయం సహాయక బృంద సభ్యులు , సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ యువతి యువకులు, రిటైర్డ్ ఆర్మీ పోలీస్ నేవీ వారు డైరెక్ట్ ఏజెంట్ గా పనిచేయుటకు అర్హులు .

ఎంపిక కాబడిన డైరెక్ట్ ఏజెంట్లు 5000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించవలసి ఉంటుంది ( తిరిగి వాపసు ఇవ్వబడును).ఆసక్తి గల అభ్యర్థులు కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర గల సూపరింటెండెంట్  ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్,  హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణ నందు వారి

ఒరిజినల్ సర్టిఫికెట్లతో  జవరి 7 వ తేదీ మరియు 8 వ తేదీలలో డైరెక్ట్ గా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందిగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ 7013029312 లో సంప్రదించవలసింది గా తెలియచేశారు..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments