గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అమరావతి రోడ్డులో ఉన్న 44వ డివిజన్‌లో ఉన్న రేషన్ దుకాణాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రేషన్ సరుకుల నిల్వలు, పంపిణీ విధానం, కార్డు దారులకు అందుతున్న సేవలపై ఆమె సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ.
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ప్రజలకు అందిస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎక్కడా అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో రేషన్ సరుకుల పంపిణీ జరగాలన్నదే ఎన్డీయే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో ఈ రేషన్ దుకాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికారుల తనిఖీల్లో అవకతవకలు నిర్ధారణ కావడంతో అప్పటి డీలర్ లైసెన్సును రద్దు చేసి, ఈ నెల నుంచి సుజాత గారికి షాప్ కేటాయించామని తెలిపారు. కొత్త డీలర్ ఆధ్వర్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు పంపిణీ జరుగుతున్నాయని ఎమ్మెల్యే గారు సంతృప్తి వ్యక్తం చేశారు.
సుజాత గారు తమ రేషన్ దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి లాగిన్ వివరాలను అధికారులకు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
అక్రమాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి రేషన్ దుకాణంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మొత్తం 90 రేషన్ షాపుల్లోనూ ప్రజా పంపిణీ సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు వెల్లడించారు.
ఇటీవల రేషన్ దుకాణాలు నెల మొదట్లోనే మూసేస్తున్నాయన్న ఫిర్యాదులు వినిపిస్తున్న నేపథ్యంలో, అలాంటి పరిస్థితులు ఎక్కడా రాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ సజావుగా నడవాలన్న దృఢ సంకల్పంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు.
వృద్ధులు, అసహాయులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించడం కూడా మంచి శుభ పరిణామమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు.
ఈ నెల నుంచి రేషన్ దుకాణాల్లో గోధుమ పిండి పంపిణీ ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.70 ఉన్న గోధుమ పిండి, చౌక దుకాణాలలో కేవలం కిలో రూ.20కే అందుబాటులో ఉంటుందని చెప్పారు. అలాగే పంచదార కూడా బహిరంగ మార్కెట్‌లో రూ.50 ఉన్న పరిస్థితుల్లో, అర్ధ కిలో రూ.17కే ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందనడానికి నిదర్శనమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు.






