శుక్రవారం రాత్రి పుంగనూరు నూతన బైపాస్ జే–టోన్ మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వీరపల్లి నల్లగంగమ్మను దర్శించుకుని చెంబుకూరు వెళ్తున్న ఆటోను, పలమనేరు నుంచి మదనపల్లి వైపు వస్తున్న కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో రామసముద్రం మండలం చెంబుకూరు హరిజనవాడకు చెందిన 11 మందికి గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ రెడ్డప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.




