కర్నూలు : జిల్లాలోని కేజీబీవీ మోడల్ వెబ్-3, 4, విధి మోడల్ స్కూల్ నందు ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులు ఐటీఐహెచ్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కుక్ కమ్ హెల్పర్, ఐఓఎస్ఎం, వాచ్ మెన్, స్వీపర్, గార్డెనింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కేజీబీవీ వెబ్-3 లో నాన్ టీచింగ్ పోస్టులు – ఐటీఐహెచ్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్-3 పోస్టులు.
కుక్ కమ్ హెల్పర్-12, ఐఓఎస్ఎం-8, వాచ్ మెన్-4, అటెండెంట్-10, డి లాండ్ వెట్ గార్డెనర్-11, ఆయా-3, స్వీపర్, స్కావెంజర్-3, కేజీబీవీ వెబ్-4 లో స్టాఫ్ నర్స్-4, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్-9, వాచ్ మెన్-4, అటెండెంట్-3, కంప్యూటర్-12, నాన్ టీచింగ్ పోస్టుల్లో పని చేయుటకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ప్రతి పోస్టుకు విడివిడిగా
దరఖాస్తు చేసుకుని వారి వివరాలను పూరించి దరఖాస్తుతో పాటు సంబంధిత విద్యార్హతలకు సంబంధిత ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రం (4 నుండి 10వ తరగతి వరకు), కాపీ, ఆధార్ కార్డు కాపీలను గెజిటెడ్ అధికారితో ధృవీకరించుకుని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల 3 నుండి 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలన్నారు. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు అనుపయోగమని ఆయన తెలిపారు. ఖాళీల వివరాలు, దరఖాస్తు నమూనా, మార్గదర్శకాలు… ఆఫీసు వెబ్ సైట్ నందు లభించగలవు




