కువైట్‌లో జరిగిన ప్రవాసాంధ్ర రెడ్డి సంఘ సమావేశానికి హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి&ఎన్నారై కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి
కులాలకే పరిమితమైన రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని, అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసే నాయకత్వమే నిజమైన ప్రజాస్వామ్యానికి పునాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ విభాగం గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు.
కువైట్‌లో ప్రవాసాంధ్ర రెడ్డి సంఘం – కువైట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ విభాగం గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథులు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.
రెడ్డి సమాజం చరిత్రపరంగా ఒక కులానికి మాత్రమే పరిమితం కాకుండా, సమాజానికి దిశానిర్దేశం చేసిన నాయకత్వాన్ని అందించిందని ఆయన పేర్కొన్నారు. ఆలోచన, త్యాగం, సిద్ధాంతం, రాజ్యాంగ విలువలు, మానవత్వం వంటి విలువలను తరతరాలుగా దేశానికి అందించిన ఘనత రెడ్డి సమాజానిదని తెలిపారు.
చరిత్రలో రెడ్డి నాయకత్వం సమాజానికి దిశానిర్దేశం చేసిన విలువలు, ఆలోచనాశక్తి, ప్రజల పట్ల బాధ్యతతో గుర్తింపు పొందిందని నాయకులు పేర్కొన్నారు. అదే సంప్రదాయం నేటి రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సంక్షేమం, సమానత్వం, రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ కొనసాగుతోందని అభిప్రాయం వ్యక్తమైంది.
యోగి వేమన సమాజానికి సత్యం, సమానత్వం, ఆలోచనా స్వేచ్ఛను బోధించి ప్రజలను చైతన్యపరిచారని యోగి వేమనను సాంబశివారెడ్డి గుర్తు చేశారు. అదే తరహాలో నేటి రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే నాయకుడిగా నిలుస్తున్నారని అన్నారు. విలువలు, ధైర్యం, ప్రజల పట్ల నిబద్ధతే ఈ నాయకత్వానికి బలం అని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య పోరాట కాలంలో బుడ్డా వెంగల రెడ్డి బ్రిటిష్ పాలనకు ఎదిరించి త్యాగస్ఫూర్తిని చాటారని తెలిపారు. అదే విధంగా నేటి రాజకీయ పోరాటాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఇబ్బందులు, రాజకీయ సవాళ్లు ఎదురైనా ప్రజల విశ్వాసాన్ని వదలకుండా ధైర్యంగా నిలబడుతున్నారని పేర్కొన్నారు.
రైతులు, కార్మికులు, పేదల హక్కుల కోసం తరిమెల నాగిరెడ్డి సిద్ధాంతపరంగా పోరాడారని ఆయన గుర్తు చేశారు. నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అదే సిద్ధాంతం ఆచరణలోకి వచ్చి, రైతులకు పెట్టుబడి సాయం, మహిళలకు ఆర్థిక భద్రత, పేదలకు సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయని తెలిపారు. ఇది సిద్ధాంతాన్ని పాలనగా మార్చిన స్పష్టమైన ఉదాహరణగా పేర్కొన్నారు.
దేశానికి రాజ్యాంగ గౌరవాన్ని చాటిన నేతగా నీలం సంజీవరెడ్డి పాత్రను గుర్తు చేస్తూ ఆయన వ్యాఖ్యానించారు. అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వ్యవస్థల పట్ల గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, పారదర్శక పాలనకు నిబద్ధుడిగా ఉన్నారని తెలిపారు.
ప్రజల కోసం పాలనకు ఆదర్శంగా నిలిచిన డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనను గుర్తు చేస్తూ ఆయన అన్నారు. ఆ సంక్షేమ విధానాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మరింత విస్తృతంగా, వివక్ష లేకుండా కొనసాగాయన్నారు.
*రాష్ట్ర భవిష్యత్తుకు దారి చూపే నాయకత్వం – జగనన్న.
సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమన్వయం చేసిన పాలన ద్వారా పేదల జీవితాల్లో భరోసా కల్పించడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాది వేయగల నాయకత్వం అవసరమని తెలిపారు. ఈ దిశగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి మళ్లీ అవసరమని స్పష్టం చేశారు.
ప్రజల పక్షాన నిలబడి కూటమి పాలనలో జరుగుతున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఎన్‌ఆర్‌ఐలు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఈ పోరాటంలో విదేశాల్లో ఉన్న మనవాళ్ల భాగస్వామ్యం కూడా కీలకమని స్పష్టం చేశారు.
*కులాలకు అతీతమైన నాయకుడు జగనన్న.
కుల రాజకీయాలకు అతీతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిందన్నారు. పేద–ధనిక, గ్రామీణ–పట్టణం, వెనుకబడిన తేడా లేకుండా పాలన అందించడమే ఆయన నాయకత్వానికి ప్రత్యేకతన్నారు. కుల ప్రాతిపదికన కాదు, ప్రజల అవసరాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే దృక్పథం ఆయన పాలనలో స్పష్టంగా కనిపించదన్నారు. అందుకే జగనన్న అన్ని వర్గాల ప్రజల నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు.
తాను రాజకీయాల్లో ఎప్పుడూ కుల ప్రాతిపదికన ఆలోచించలేదని, తన వ్యక్తిగత జీవితంలోనే కుల వివక్షను తిరస్కరించినట్టు ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన జొన్నలగడ్డ పద్మావతి తన జీవిత భాగస్వామి అని, ఆమె ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
చరిత్ర అనేక గొప్ప నాయకులను చూపించిందని, అయితే కొద్ది సందర్భాల్లో మాత్రమే మన కళ్లముందే నిలిచే ప్రత్యక్ష ఉదాహరణ కనిపిస్తుందని ఆయన అన్నారు. నేడు రెడ్డి సమాజం అందించిన విలువలు, ధైర్యం, మానవత్వానికి ప్రత్యక్ష ఉదాహరణగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారని పేర్కొన్నారు.
విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ సామాజిక సేవ, సహాయ కార్యక్రమాలు, సంఘీభావంతో ముందుకు సాగుతున్న ప్రవాసాంధ్ర రెడ్డి సంఘం – కువైట్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సేవాభావంతో పనిచేసే ఇలాంటి సంఘాలే సమాజానికి నిజమైన బలమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు.
కువైట్‌లో ప్రవాసాంధ్ర రెడ్డీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అహ్మది ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో రెడ్డి గారి సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించామని అసోసియేషన్ అధ్యక్షుడు నాయని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ అంబాసిడర్ పరిమిత త్రిపాటి, వైఎస్సార్‌సీపీ ఎన్నారై కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, అతిథులుగా గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్., కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, దుబాయ్ రెడ్డి సంఘం అధ్యక్షుడు గాడి రెడ్డయ్య రెడ్డి, దుబాయ్ ప్రముఖ వ్యాపారవేత్త సుధాకర్ రెడ్డి హాజరయ్యారు.




