దస్తూరాబాద్ మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలి చిత్రపటానికి అధికారులు ఉపాధ్యా యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్యా వికాసానికి ఆమె చేసిన కృషిని స్మరించుకున్నారు.
నేటి తరం విద్యార్థులు ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో హెచ్ఎంలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




