గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఈ నెల 3,4, 5వ తేదీల్లో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా.చంద్రబాబు నాయుడు గారు 5వ తేదీన హాజరు కానున్నారు.
గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి స్పిరిచువల్ సిటీలో జరుగుతున్న ఏర్పాట్లను ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా IAS గారు, ఇతర పోలీస్ అధికారులతో కలసి పర్యటించి, జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు.
స్పిరిచువల్ సిటీలో ఏర్పాటు చేసిన సభా వేదికను, సభా ప్రాంగణాన్ని, హెలిపాడ్ నిర్మాణాన్ని, వీవీఐపీ గారి రాకపోకల మార్గాలను పరిశీలించి, సంబంధిత అధికారులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సభలకు హాజరయ్యే ప్రముఖుల భద్రతను దృష్టిలో పెట్టుకొని,సభా వేదిక, సభా ప్రాంగణం,వీవీఐపీ మార్గాలు, హెలిప్యాడ్ మొదలగు ప్రదేశాల్లో క్షుణ్ణంగా భద్రతా తనిఖీలు చేపట్టాలని, అవసరమైన చోట భారీ కేడింగ్ ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకి సూచించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ ATV రవికుమార్ గారు(L&O), శ్రీ ఏ హనుమంతు గారు(ఏఆర్), ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బి సీఐ అలహరి శ్రీనివాస్ గారు, లాలాపేట సీఐ శివ ప్రసాద్ గారు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.




