Home South Zone Andhra Pradesh రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం |

రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం |

0

రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం
ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి దిశానిర్దేశంలో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఏపీ రెవెన్యూ శాఖ శ్రీకారం చుట్టింది.

చీరాల: చీరాల పట్టణం ఉజిలిపేట నందు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.

గతంలో జగన్ ఫోటోతో జారీ చేసిన పాసుపుస్తకాల్లోని తప్పిదాలను సవరించి, ప్రభుత్వ రాజముద్రతోపాటు క్యూఆర్ కోడ్స్‌తో రూపొందించిన కొత్త పాసు పుస్తకాలను రైతులకు, భూయజమానులకు అందజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వే నిర్వహించింది. జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్‌లతో కూడిన  21.86 లక్షల పాస్ పుస్తకాలను వెబ్ ల్యాండ్‌లోని వివరాలతో సహా ముద్రించడం జరిగింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజల పాలిట మరణ శాసనంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌ నుంచి విముక్తి కలగించి, నేడు జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందజేసిన సీఎం చంద్రబాబు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..

ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్ గారు చీరాల ఎమ్మార్వో , AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్, లబ్ధిదారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

#Narendra

Exit mobile version