విద్యార్థుల బంగారు భవితవ్యానికి వారధి ఇంటర్మీడియట్ విద్య విట్ తో విజిఆర్ యం విద్యాసంస్థ అనుసంధానం బాపట్ల విద్యార్థులకు మరో కానుక
బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల: విద్యార్థుల ఉజ్వలమైన బంగారు భవిష్యత్తుకు వారధి ఇంటర్మీడియట్ విద్య అని, సరైన ప్రణాళిక, క్రమశిక్షణ తోడైతే ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు.
బాపట్లలోని విజిఆర్ ఎం విద్యా సంస్థ ఆవరణలో నూతన సంవత్సర వేడుకలు మరియు విట్ జూనియర్ కళాశాలతో అనుసంధాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ… బాపట్ల ప్రాంతానికి ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకును తీసుకువచ్చిన ఘనత విజిఆర్ఎం విద్యాసంస్థకే దక్కిందని, మళ్లీ రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి బాపట్ల ఖ్యాతి పెంచాలని ఆకాంక్షించారు.
అంకితభావం క్రమశిక్షణకు మారుపేరుగా వి జి ఆర్ ఎం విద్యాసంస్థ నిలిచిందని, ఐఐటి, జేఈఈ, ఎంసెట్ పరీక్షలలో ఉన్నత ర్యాంకుల సాధనలో ఎంతో అనుభవం కలిగిన విట్ జూనియర్ కళాశాల వారితో అనుసంధానం కావడం శుభ పరిణామం అన్నారు.
బాపట్ల ప్రాంత పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు సాధారణ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ కళాశాలలకు ధీటైన విద్యను అందిస్తున్న వీజీఆర్ఎం విద్యాసంస్థల పనితీరు ప్రశంసనీయమని అభినందించారు.
వి జి ఆర్ ఎమ్ కళాశాల డైరెక్టర్ అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ చేతుల మీదుగా విట్ జూనియర్ కళాశాలతో అనుసంధానం జరగడం తమకు శుభశకునంగా అదృష్టంగా భావిస్తామన్నారు.
2013లో ఆవిర్భవించిన తమ విద్యాసంస్థ గడచిన 12 సంవత్సరాలుగా స్టేట్ ఫస్ట్ సహా, అనేక రాష్ట్రస్థాయి ర్యాంకులను బాపట్ల బాట పట్టించిన తమ కళాశాల విట్ విద్యాసంస్థల అనుబంధంతో రాబోయే రోజులలో ఐఐటి, జేఈఈ, ఎంసెట్లో మరిన్ని ఉత్తమ ర్యాంకులను సాధించి బాపట్ల ప్రజలకు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
నూతన సంవత్సర శుభవేళ తమ కళాశాల తీసుకున్న నూతన అనుసంధాన నిర్ణయం ద్వారా మరింత పురోగతిని నమోదు చేసి, మరొక్క మారు తమను తాము నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
విట్టు విద్యాసంస్థలో అధ్యాపక వర్గం గురించి చెప్పాలంటే రాష్ట్రస్థాయిలో అనేక పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు మెటీరియల్ ను, సిలబస్ ను రూపొందించి ఇచ్చిన ఘన చరిత్ర కలిగిన వారని, అలాంటి నిపుణుల శిక్షణ పర్యవేక్షణలో తప్పనిసరిగా ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో విట్ విద్యాసంస్థ తరపున కేఎస్ఆర్, డిఎస్ఆర్, రాఘవ, విజిఆర్ఎం తరఫున డైరెక్టర్లు అంబటి గిరిధర్ కుమార్ ఆదెళ్ళ విజయ్ కుమార్ ఇంకా బాపట్ల పరిసర ప్రాంతాల నుండి వివిధ విద్యాసంస్థల పాఠశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
#Narendra




