Monday, January 5, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసావిత్రీ బాయి పూలే జయంతి ఘనంగా జరుపుకున్న వైయ‌స్సార్సీపీ|

సావిత్రీ బాయి పూలే జయంతి ఘనంగా జరుపుకున్న వైయ‌స్సార్సీపీ|

జ‌యంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, పార్టీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు మ‌ల‌సాని మ‌నోహ‌ర్‌రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ అధ్య‌క్షులు న‌ల‌మారు చంద్ర‌శేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షులు నారాయ‌ణ మూర్తి, బీసీ సెల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ద‌స్త‌గిరితోపాటు ప‌లు పార్టీ విభాగాలనాయ‌కులు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను హాజరు.

– సావిత్రీ బాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకం
– మహిళాభ్యుదయం, మహిళా సాధికారత సాధనలో ఆమె సేవలు చిరస్మరణీయం : వైయస్సార్సీపీ నేతలు
తాడేప‌ల్లి:
మ‌హిళ‌ల్లో అక్ష‌రాస్య‌త పెంచ‌డం ద్వారా మహిళాభ్యుదం, సాధికార‌త సాధ్య‌మ‌ని గ్ర‌హించి అందుకోసం పాటుబ‌డిన మ‌హ‌నీయురాలు సావిత్రీబాయి పూలే అని వైయస్సార్సీపీ నాయ‌కులు కొనియాడారు. సావిత్రీబాయి పూలే జ‌యంతి సందర్భంగా తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. పార్టీ నాయ‌కులు ఆమె చిత్ర‌ప‌టానికి పూల‌మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రీ బాయి పూలే ఆశ‌యాల‌కు అనుగుణంగానే గ‌త వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యారంగంలో మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారు వినూత్న మార్పులు తీసుకురావ‌డ‌మే కాకుండా మహిళ‌ల‌ను ఉన్న‌త స్థానాల్లో నిల‌బెట్టి రాజ‌కీయంగా ప్రోత్స‌హించార‌ని గుర్తు చేశారు.

ఆఖ‌రి శ్వాస వ‌రకు కూడా ప్ర‌జా సేవ‌లోనే గ‌డిపిన సావిత్రీ బాయి జీవితం నేటి రాజ‌కీయ నాయ‌కుల‌కు ఆద‌ర్శ‌మ‌న్నారు. ఎన్నో అవ‌మానాలు, అవ‌రోధాల‌ను దాటుకుని భ‌ర్త స‌హకారంతో మహిళ‌ల కోసం విద్యాల‌యాలు స్థాపించి వారి అభ్యున్న‌తి కోసం కృషి చేశార‌ని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments