Saturday, January 3, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshస్వచ్ఛ నగర సాధనకు ప్రజల సహకారం అవసరం : నగర కమిషనర్

స్వచ్ఛ నగర సాధనకు ప్రజల సహకారం అవసరం : నగర కమిషనర్

కర్నూలు
స్వచ్ఛతలో నగరానికి అగ్రస్థానమే లక్ష్యం• స్వచ్ఛ నగర సాధనకు ప్రజల సహకారం అవసరం• నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్• ‘స్వచ్ఛ సర్వేక్షన్’ మార్గదర్శకాల అమలుపై సమీక్షకర్నూలు నగరాన్ని స్వచ్ఛతలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పారిశుద్ధ్య విభాగ సిబ్బందికి సూచించారు.

శుక్రవారం కమిషనర్ నివాస కార్యాలయంలో ‘స్వచ్ఛ సర్వేక్షన్’ మార్గదర్శకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష సమావేశం కమిషనర్ నిర్వహించారు.నగర స్వచ్ఛతను మరింత మెరుగుపరిచే దిశగా అధికారులు, సిబ్బంది మరింత చురుగ్గా పనిచేయాలని కమిషనర్ సూచించారు.

స్వచ్ఛ సర్వేక్షన్ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు, విధివిధానాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. ప్రతి వార్డులో ప్రజలను చైతన్యపరిచే ర్యాలీలు, అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు.

వాల్ పెయింటింగ్స్, మైక్ అనౌన్స్మెంట్లు, వార్డుల మధ్య స్వచ్చత పోటీల ద్వారా ప్రజల్లో స్వచ్ఛతపై మరింత అవగాహన పెంచాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… స్వచ్ఛ నగర సాధన అనేది కేవలం నగరపాలక బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామిగా మారినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. ఇంటి నుంచే చెత్తను వేరు చేయడం.

ప్రజా ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం వంటి చిన్న చర్యలే పెద్ద మార్పుకు దారితీస్తాయన్నారు. అధికారులు, సిబ్బంది ప్రజలతో సమన్వయంగా పనిచేస్తూ కర్నూలును ఆదర్శ స్వచ్ఛ నగరంగా నిలబెడదామని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్‌.జి.వి. కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగప్రసాద్, డిఈఈ పవణ్ రెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ శ్రీనివాసులు, స్వచ్ఛ సర్వేక్షన్ కోఆర్డినేటర్లు శ్రీనివాస్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments