సౌర విద్యుత్ ఆధారంగా ఛార్జింగ్ అయ్యే గడ్డి కోసే పరికరాన్ని కడెం మండలం పాతమద్దిపడిగ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్థిని బైరి హర్షిక తయారు చేసింది. ఇటీవల నిర్మల్ లో నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డు పోటీల్లో ఈ పరికరం ఆకట్టుకుంది.
రాష్ట్రస్థాయి పోటీలకు ఈ పరికరం ఎంపికైనట్లు భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు దశరథ్ పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో సోలార్ ప్యానల్ తో తయారు చేసిన ఈపరికరం రైతులకు ఉపయోగపడుతుందన్నారు. శనివారం పాఠశా లలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థినిని ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు అభినందించారు..
# saketh




