Wednesday, January 7, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshప్రమాదాలు అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం విన్నుత ఆలోచన |

ప్రమాదాలు అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం విన్నుత ఆలోచన |

అన్నవరం
ప్రత్తిపాడు సర్కిల్
కాకినాడ జిల్లా

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల అనుసారం, రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గ నిర్దేశం మేరకు.|

పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ డి శ్రీహరి రాజు, ప్రతిపాడు సిఐ శ్రీ బి సూర్యఅప్పారావు గార్ల సూచనలతో అన్నవరం పోలీసులు 2026 సంవత్సరంలో ప్రమాదాల నివారణకు వినూత్న ఆలోచన చేసారు.

నేషనల్ హైవే 216 లో అన్నవరం పిఎస్ పరిధిలో, గతంలో రోడ్డు ప్రమాదం కారణంగా నుజ్జు అయిన కార్లకు రేడియం స్టిక్కరింగ్ చేయించి రోడ్డు పక్కన ఉంచి రోడ్డుపై వెళ్లే వాహనదారులకు అప్రమత్తం చేసే విధంగా ఉంచినారు.

తద్వారా వాహనదారులు అలర్ట్ అయ్యి అతివేగంగా వెళ్లకుండా,జాగ్రత్తగా వెళ్తూ వారి యొక్క ప్రయాణం, సురక్షితంగా ప్రమాద రహితంగా జరగాలని పోలీసులు ఆకాంక్ష…
ఈ కార్యక్రమానికి చొరవ చూపిన అన్నవరం పోలీస్ వారిని స్థానికులు, వాహనదారులు అభినందిస్తున్నారు..

#Dadala Babji

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments