*చార్వాక వెంకటేశ్వర్లు ఒక అరుదైన విశిష్ట వ్యక్తి ఆయన మరణం హేతువాద ఉద్యమానికి తీరని లోటు* – *రిటైర్డ్ ఐపీఎస్ ఏ.బీ వెంకటేశ్వరరావు*
విజయవాడ: భారత హేతువాదసంఘo ఆధ్యక్షులు నార్నెవెంకటసుబ్బయ్య అద్యక్షతన ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో చార్వాక వెంకటేశ్వర్లు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏ.బి వెంకటేశ్వర రావు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 1970 – 80 సం” విజయవాడ కేంద్రంగా చార్వాడ అనే హేతువాద పత్రికను
తోటకూర వెంకటేశ్వరరావు స్థాపించారు ఆయన ఈ మధ్యనే కాలం చేశారని ఆయన జ్ఞాపకార్థం గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటున్నామని అన్నారు.ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని భక్తి వ్యక్తిగతంగా ఉంచుకోవాలని కానీ ఆ రకంగా ఈరోజు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.చాలామంది పెద్దలు ఆయనకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారు ఉన్నారని ,అంతేకాకుండా హేతువాద ఆలోచనలతో ఆకర్షితులైన వారు ఉన్నారని
హేతువాద ఉద్యమాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్లాలి అనే ఆలోచనతో భవిష్యత్తు కార్యాచరణకి ఈ సభ ఎంత దోహదపడుతుందని చార్వాక పత్రికను డిజిటల్ లెవెల్ లో మరియు ప్రింటింగ్ కావలసిన నిధులను హేతువాదసభ్యులు మనమందరం కలిసి పత్రికకు పూర్వవైభవం తీసుకురావాలని ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు.
భారతహేతువాద సంఘ ఆధ్యక్షులు నార్నెవెంకటసుబ్బయ్య మాట్లాడుతూ మానవేంద్రనాద్ రాయ్ భావాలతో ప్రభావితుడైన వెంకటేశ్వర్లు గారు 1976 లో చార్వాక పత్రికను స్థాపించి హేతువాద ఉద్యమానికి బలం చేకూర్చి ఉద్యమానికి ఊపునిచ్చింది.
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా,బాబాలను సవాలుచేస్తూ ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో ప్రతిపట్టణంలోను సభల ఏర్పటుచేసి హేతువాద నాస్తికోద్యమానికి గట్టి పునాదిచేసినవ్యక్తి చార్వాక .
ఎక్కడ రాజీపడకుండా నిరాడంబరంగా గొప్ప ఆచరణవాదిగా పట్టువదలని విక్రమార్కునిలా సమాజ మార్పుకొరకు , మూఢ నమ్మకాల నిర్ములనకొరకు జీవితంతం కృషిచేశాడు.
అయన ఆశయాలను ముందుకి తీసుకపోవటమే మనందరి ఆశయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చార్వాక వెంకటేశ్వర్లు కుమారులు రాజ్ కుమార్ తోట కూర, 50 ఏళ్లుగా ఆయనతో పనిచెసిన సిద్దార్ధ భక్షు , డాక్టర్ సమరం,నాస్తికకేంద్రం నియంత , తుమ్మల గొపాలరావు , సత్యనారాయణ, జమిందార్, మోతుకూరి వెంకటేశ్వర్లు , పూర్ణగాంధీ , శ్రీశ్రీ సాహిత్య విశ్వేశ్వరరావు,ఆంధ్రభూమి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు…




