గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ శంకుస్థాపన కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ…
ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. పల్నాడు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు గుంటూరు నగరంలోకి ప్రవేశించకుండా నేరుగా వెళ్లేందుకు ఈ రహదారి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. దీని ద్వారా నగరవాసులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నిలిచిపోయిందని, భూసేకరణ సమస్యలు, నిధుల లేమితో పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కీలక ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసిందని తెలిపారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గుంటూరు అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పూర్తయితే, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు.




