బాలింత మృతికి ఆ ఇద్దరు వైద్యులే కారణం, కేసు నమోదుకు డిమాండ్
చీరాల: చీరాలలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ రామకృష్ణ హనుమాన్, డాక్టర్ గోరంట్ల రాజేష్ ల నిర్లక్ష్యం కారణంగా సౌమ్య అనే బాలింత మృతి చెందిందని హైకోర్టు అడ్వకేట్ రజిని శనివారం మీడియాకు చెప్పారు. డిసెంబర్ 16వ తేదీ ఉదయం ఆరు గంటలకు సౌమ్యకు డాక్టర్ రామకృష్ణ హనుమాన్ కు చెందిన శంకర్ లాప్రోస్కోపీ అండ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో సిజేరియన్ ఆపరేషన్ జరిగిందని.
కానీ ఆమెకు సాయంత్రం వరకు స్పృహ రాకపోయినా డాక్టర్ పట్టించుకోలేదన్నారు.తదుపరి గోరంట్ల రాజేష్ ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడకు మూడు గంటలు వృధా చేశారన్నారు.చివరకు పరిస్థితి విషమించడంతో గుంటూరు తరలిస్తుండగా ఆ రాత్రి సౌమ్య మార్గమధ్యంలో మృతి చెందిందన్నారు.
డాక్టర్లు కనుక ఆలస్యం చేయకుండా ఆమెను వెంటనే గుంటూరు తరలించి ఉండుంటే ఆమె బతికేదన్నారు.కేవలం ఆ ఇద్దరు వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మరణించినందున వారిపై తక్షణం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రజని డిమాండ్ చేశారు.లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.మీడియా సమావేశంలో సౌమ్య తండ్రి పి ఏడుకొండలు సిఐటియు నాయకుడు వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
#Narendra




