మదనపల్లె BKపల్లి పరిధిలోని 2.92 ఎకరాల మాజీ సైనికుల భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ కబ్జా చేశారని సైనికుల సంఘ నేత కంచర్ల శ్రీనివాసులు శనివారం ఆరోపించారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, రమేష్, ఆయన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.
ఈ వ్యవహారంలో అప్పటి ఎంఆర్ఓ, ఆర్‌ఐ, వీఆర్వోలు రికార్డులు మార్చినట్లు జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చినట్టు పేర్కొన్నారు. లోకాయుక్త ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.




