గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ సిటీలో ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు నేటి నుండి మూడు రోజుల(3,4,5వ తేదీలు) పాటు నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనడానికి మారిషస్ అధ్యక్షులు శ్రీ ధరమ్ బీర్ గోకుల్ గారు సతీసమేతంగా ఈ రోజు సాయంత్రం గుంటూరు విచ్చేసారు.
ఈ సందర్భంగా ఆయన రాకను పురస్కరించుకుని ITC వెల్కమ్ హోటల్ వద్ద జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు మారిషన్ దేశాధ్యక్షుల వారికి, మొక్కను అందించి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా IAS గారు కూడా పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా పోలీస్ శాఖ తరపున ఘనమైన పోలీస్ గౌరవ వందనం కూడా సమర్పించారు.ITC వెల్కమ్ హోటల్ వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ(ఏఆర్) శ్రీ హనుమంతు గారు,RDO శ్రీనివాసరావు గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారు, ట్రాఫిక్ డిఎస్పీ బెల్లం శ్రీనివాస్ గారు, ఎస్బి సీఐ అలహరి శ్రీనివాస్ గారు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.




