ఆదివారం, పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుం పోలీస్ స్టేషన్‌ను కర్నూల్ డిఐజి కోయ ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, డిఎస్పి మహీంద్రా ఆయనకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించి, సిబ్బందికి శాంతి భద్రతలు, పరిపాలనపరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి ఎస్సై నాగేశ్వరరావు, ఏఎస్ఐ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.




