Thursday, January 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshస్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం. మేకింగ్ ఇండియాకి మద్దతు ఇద్దాం

స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం. మేకింగ్ ఇండియాకి మద్దతు ఇద్దాం

స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం మేకిన్ ఇండియాకి మద్దతిద్దాం
ఖాదీ ని ఆదరిద్దాం.. గ్రామీణ ప్రాంత తయారీ వస్తువులను ప్రోత్సహిద్దాం
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దాం
భవిష్యత్ తరాలకు మన వారసత్వంగా ఖాదీ ఉత్పత్తులను అందిద్దాం
10 రోజులపాటు ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్

విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని)

ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను ప్రోత్సహించి మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామీణ భారతాన్ని నిర్మిద్దాం అని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.

స్థానిక పంటకాలువ రోడ్డులోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర స్థాయి ఖాదీ మహోత్సవ్ – 2025-2026 లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను శనివారం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడలో ఏర్పాటు చేసిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ప్రదర్శనలో

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నుండి అనేకమంది హస్తకళాకారులు మరియు పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి విజయవాడకు తదలి వచ్చారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘స్వదేశీ వస్తువుల వినియోగం’ అనే లక్ష్యాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP) ద్వారా ఎంతోమంది యువతీ యువకులు సబ్సిడీ లోన్లు పొంది, స్వయం ఉపాధి సాధిస్తూ సొంత కాళ్లపై నిలబడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రధాని మోదీ ఆశయానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యానికి లోకల్ బ్రాండ్‌లను ప్రోత్సహించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విజయవాడ నగర ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి, ఇక్కడి స్టాళ్లను మరియు హస్తకళాకారులను ప్రోత్సహించాలని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. భావితరాలకు మన

వారసత్వంగా ఖాదీ వస్తువులను అందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇలా ప్రోత్సహించడం వల్ల తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులు లభించి వారి జీవనోపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందేలా ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు.

రాష్ట్ర సంచాలకులు డా.ఎస్. గ్రీప్ మాట్లాడుతూ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC), భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో పీఎంఈజీపి ఖాదీ మార్కెటింగ్ రాష్ట్రస్థాయి సంయుక్త మార్కెటింగ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ఎగ్జిబిషన్ 10 రోజులపాటు నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.

ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను నగర ప్రజలు సందర్శించి కొనుగోలు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులచే 100 కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రదర్శనలో ఖాదీ వస్త్రాలు, చేతివృత్తుల వారి నైపుణ్యంతో తయారైన విభిన్న రకాల ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉంటాయని కె.వి.ఐ.సి సంచాలకులు డా. ఎస్. గ్రీప్ తెలియజేశారు.

ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సహాయ సంచాలకుల ఆర్.ఎల్. ఎన్. మూర్తి మాట్లాడుతూ ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) కింద తయారైన ఉత్పత్తులకు ఈ ఎగ్జిబిషన్ లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో ఇంటి ఇయర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, స్థానిక కార్పొరేటర్ దేవినేని అపర్ణ, పరిశ్రమల శాఖ స్పెషల్ డైరెక్టర్ ఏ. రామలింగేశ్వరరాజు, కేవీఐసీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments