దస్తూరాబాద్ మండలంలో ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రోడ్లు స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మంచు తీవ్రతకు పొలాలకు వెళ్లిన రైతులు సైతం వెనుదిరిగారు. కొద్ది దూరం కూడా దారి కనిపించకపోవడంతో వాహనాలు నడపడం కష్టతరమైందని ప్రయాణికులు వాపోయారు. అకస్మాత్తుగా మారిన వాతావరణంతో జనజీవనం స్తంభించింది.




