కార్యకర్త కోసం అర్థరాత్రి ఆస్పత్రికి పరిగెత్తిన హోమ్ మంత్రి అనిత
కార్యకర్త ఫోన్ కాల్… ఒక తల్లి లా స్పందించిన హోమ్ మంత్రి అనిత
కార్యకర్తంటే? హోమ్ మంత్రి అనిత గారి దృష్టిలో ఎంతో తెలుసా?
జనవరి 4, ఆదివారం. ఇంకా కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందుతూనే ఉన్న సమయం. సాధారణంగా రాజకీయ నాయకులకు కొంచెం విశ్రాంతి దొరికే రోజు కూడా ఆదివారమే. కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత కు అది ఆదివారం కాదు, సాధారణ వారపు రోజు కంటే ఎక్కువ షెడ్యూల్ ఉంది.
ఉదయం 8 గంటల నుంచే నియోజకవర్గంలోని గ్రామాల సందర్శన, వివిధ కార్యక్రమాలు… ఒకటి కాదు, వరుసగా అనేక ప్రోగ్రామ్స్. ప్రజలతో మాటలు, సమస్యలు వినడం, అభ్యర్థనలు.
రాత్రి 10 గంటలైనా షెడ్యూల్ ఇంకా పూర్తికాలేదు.
10 గంటల తర్వాత ఇంటికి చేరుకుని, కాస్త రిఫ్రెష్ అవడానికి సిద్ధమైన సమయం. పూర్తిగా అలసిపోయిన నిస్సహాయ స్థితి.
అంతలో ఒక ఫోన్ కాల్.
“అమ్మా… నాకు బాగా జ్వరం వచ్చింది. హాస్పిటల్‌లో ఉన్నాను. భయంగా ఉంది…”
ఆ గొంతు తన కుమారుడిది కాదు, తన బంధువులది కాదు, అంతకుమించి ఏ పరపతి ఉన్నా నాయకుడిదో కూడా కాదు,
ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో కాదు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం పెట్టే ఐటీడీపీ కార్యకర్త దమ్ము రాజు.
పార్టీ అంటే ప్రాణం అన్నట్టుగా బ్రతికే కార్యకర్త.
ఆ మాటలు విన్న క్షణంలోనే అనిత గారికి అది ‘కార్యకర్త ఫోన్’లా అనిపించలేదు.
సొంత బిడ్డ తల్లిని పిలిచినట్టే అనిపించింది.
ఆ కాల్ వినగానే తన సొంత బిడ్డే తనకు ఆ బాధను చెప్పినట్టు అనిపించింది. నీరసించి ఉన్నా వెంటనే హాస్పిటల్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆసమయంలో అప్పటికే అలసిపోయి ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. తానే వెళ్ళి చూసి రాజు కి ధైర్యం చెప్పి రావాలనుకుంది.
అప్పటికే భద్రతా సిబ్బంది కూడా ఉదయం నుంచి అలసిపోయి ఉండడంతో వాళ్లను ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు కూడా. వాస్తవానికి హోమ్ మంత్రి స్తాయిలో… ఎలాంటి సమయాల్లో అయినా తన సిబ్బందిని కమాండ్ చేయొచ్చు,
కానీ ఆ రోజు అనిత గారు ఆదేశించలేదు…
వినమ్రంగా రిక్వెస్ట్ చేశారు.
“హాస్పిటల్ కు వెళ్లాలి… తప్పకుండా వెళ్లాలి” అన్నారు.
హోమ్ మంత్రి ఆర్ద్రతను చూసి సెక్యూరిటీ సిబ్బంది కూడా మీ వెంటే మేము కూడా అన్నారు.
ఆ రాత్రి 10 గంటల తర్వాతే నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు.
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న దమ్ము రాజును పరామర్శించారు.
ఆతనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
అక్కడితో ఆమె బాధ్యత ముగిసిందా
లేదు.
ఆస్పత్రిలో ఉన్న దమ్ము రాజు కుటుంబసభ్యులను అక్కడి సౌకర్యాలు గురించి అడుగుతూనే భోజనాలు చేసారా అని అడిగింది. వాళ్లనుంచి వచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఉదయం నుంచి అప్పటికే తమకోసం సిద్ధంగా ఉన్న ఫుడ్ ను వెంటనే హాస్పిటల్ కి తెప్పించి వాళ్లకు అందించింది.
ఇది ఒక హోమ్ మంత్రి అని ఎక్కడా అనుకోకుండా ఒక కార్యకర్త కుటుంబాన్ని తన కుటుంబంలా చూసి స్పందించిన తీరే ఈరోజు చర్చగా మారింది
ఆ సమయంలో అక్కడ ఉన్నవాళ్లకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది.
ఇది కేవలం ఒక మంత్రి పరామర్శ కాదు.
ఇది ఒక కార్యకర్తపై నాయకురాలి నమ్మకం.
ఇది పార్టీ–కార్యకర్త మధ్య ఉన్న బంధం.
తెలుగుదేశం పార్టీ లో కార్యకర్త విలువ ఏమిటో చెప్పే ఘటన ఇది.
చంద్రబాబు నాయుడు,
నారా లోకేష్ లు చెబుతున్న ‘కార్యకర్తే పార్టీ బలం’ అనే మాటకు ఇది ప్రాక్టికల్ ఉదాహరణ.
రాత్రి 10 తర్వాత కూడా ఒక కార్యకర్త కోసం మళ్లీ బయటకు రావడం…
అలసటను పక్కన పెట్టి ఆస్పత్రికి వెళ్లడం…
ఇది ప్రచారం కోసం కాదు.
కెమెరాల కోసం కాదు.
మనసులోంచి వచ్చిన స్పందన.
పాయకరావుపేట నియోజకవర్గంలో ఈ ఘటన ఇప్పుడు ఒక సంచలనం గా మారింది.
“కార్యకర్తకు కష్టం వస్తే… అనిత గారు ఉన్నారు” అని.
రాజకీయాల్లో అధికారమే కాదు…
ఆత్మీయతే అసలైన బలం అని ఈ ఒక్క ఘటన మళ్లీ చెప్పింది.




