మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పి.ఎస్. ఎస్ హెచ్ ఓ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 4వ తేదీ తెల్లవారు జామున ఆనంద్ రావు నగర్ కు చెందిన తిలక్ రాజ్ (28) పై లక్ష్మణ్ యాదవ్, సోను యాదవ్, రాము, మరియు అంజి అనే వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తిలక్ రాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితుడు ఆదివారం మధ్యాహ్నం సుమారు 2:30 ప్రాంతంలో మృతి చెందినట్లు ఆయన తెలిపారు.
పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో నిందితులు మరియు మృతుడు బంధువులని కుటుంబ కలహాల కారణాల గానే ఈ ఘటన జరిగినట్టు తేలిందన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు నిందితులను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని ఆయన తెలిపారు.
#sidhumaroju




