కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి దాడికి గురైన ముత్తిన రామకృష్ణను బీసీవై పార్టీ నాయకురాలు డాక్టర్ అనూష యాదవ్ ఆదివారం సాయంత్రం పరామర్శించారు. బాధిత కుటుంబానికి చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని.
అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒక మనిషిపై విచక్షణారహితంగా దాడి చేసిన దోషులను రక్షించే ప్రయత్నాలు జిల్లాలో ఉన్న ప్రముఖ ప్రజా ప్రతినిధులు కేసు నీరుగారిచే పనిలో నిమగ్నం అవ్వడం వలన బాధిత కుటుంబం భయాందోళనకు గురవుతుందని న్యాయం దక్కదేమో! అని ఆందోళనలో ఉన్నారని, వారందరికీ న్యాయం జరిగే వరకు తను అన్ని విధాల అండగా ఉంటానని అనూష యాదవ్ అన్నారు.
ఈ సంఘటన జరిగిన సందర్భాన్ని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్ బాధితుడే స్వయంగా ఫోన్లో వివరించగా, బాధిత కుటుంబానికి తోడుగా ఉంటానని అవసరమైన సందర్భంలో కత్తిపూడి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కత్తిపూడి, సీతంపేట గ్రామాలకు సంబంధించిన పలువురు పెద్దలు, యాదవ్ సోదరులు పాల్గొన్నారు..
#Dadala Babji




