కర్నూలు : డోన్ డోన్ నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది.
ఈ క్రమంలో ఈ రోజు డోన్ పట్టణంలోని ఎస్.సి. బరియల్ గ్రౌండ్‌లో రూ. 9.20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ మరియు నీటి సదుపాయాల ఏర్పాటు పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారుఈ కార్యక్రమంలో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు పాల్గొని భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,డోన్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అభివృద్ధి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యంగా ఎస్సీ సమాజానికి సంబంధించిన సౌకర్యాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.బరియల్ గ్రౌండ్ అభివృద్ధితో పరిశుభ్రత, భద్రత, తాగునీటి సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు మరింత ఉపయోగకరంగా మారుతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ నాణ్యమైన పనులు చేపట్టి, నిర్ణీత గడువులో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు క్రిస్టియన్ కమ్యూనిటీ సభ్యులు ,పాస్టర్లు స్థానికులు పాల్గొన్నారు.




