Tuesday, January 6, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshబాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆమంచి నియామకం |

బాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆమంచి నియామకం |

బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

బాపట్ల: బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఆమంచి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ తోనే ప్రారంభమైంది. ఆ పార్టీ పక్షాన వేటపాలెం జడ్పిటిసిగా ఎంపీపీగా చీరాల ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన చరిత్ర ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ అ ధ్యక్షునిగా కూడా ఆమంచి గతంలో పని చేశారు.2024 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లోకి వచ్చిన ఆమంచి చీరాలలో పోటీ చేసి రాష్ట్రంలోనే అ త్యధికంగా 42 వేల ఓట్లు తెచ్చుకున్నారు.

ఆమంచికి జిల్లా రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది.ఇంకా చెప్పాలంటే ఆమంచికి రాష్ట్రస్థాయిలో క్రేజు ఉంది.అన్నిటికి మించి మాస్ ఇమేజ్ ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్.ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న అధిష్టాన వర్గం ఆమంచిని ఒప్పించి మరీ ఈ పదవిని ఇచ్చింది.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో ఆమంచి మ్యాజిక్ తప్పనిసరిగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు

#Narendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments