పుంగనూరులో వేంకటేశ్వర థియేటర్ సమీపంలో నివసిస్తున్న శంకరప్ప ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి హత్యగా నిర్ధారించారు.
వివరాలు చూసినట్లయితే శంకరప్ప తన భార్య మృతి చెందడంతో నగలను కుమార్తెకు ఇచ్చారు. దీనిని తిరిగి ఇవ్వమని అడగడంతో అల్లుడు వీర మోహన్ రెడ్డితో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కిందపడిన శంకరప్పను అల్లుడు రాయితో కొట్టి చంపినట్టు సీఐ సుబ్బరాయుడు తెలిపారు# కొత్తూరు మురళి.




