దుర్గ గుడిలో ప్రత్యేక
పూజలు చేసిన
మారిషష్ దేశఅధ్యక్షులు
ధర్మంబీర్
విజయవాడ దుర్గ గుడి, జనవరి 5.
అమ్మవారి ఆలయానికి సోమవారం ఉదయం
మార్షష్ అధ్యక్షులు ధర్మం
బీర్ విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు.
అమ్మవారి ఆలయానికి చేసిన సందర్భంలో వీరిని
ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వి. కె. శీనానాయక్, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శా, నగరపోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మారిషష్ దేశఅధ్యక్షులను ఘనంగా స్వాగతించారు.
విదేశీ అతిధిని ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభస్వాగతంతో అమ్మవారి ఆలయంలోకి తోడ్కోని వెళ్లారు.
మారిషష్ దేశఅధ్యక్షులు ధర్మంబీర్ గొఖోల్ దంపతులకు శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం దేవస్థానం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.
దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వి. కె. శీనానాయక్ ధర్మంబీర్ గొఖోల్ దంపతులకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదములు అందజేశారు.




