హైదరాబాద్ : రెండేళ్లకు ఒక్కసారి అత్యంత వైభవంగా జరిగే తెలంగాణ కుంభమేళా.
ఈనెల 28 నుండి 31వ తేదీ వరకు జరిగే శ్రీ సమ్మక్క- సారలమ్మ మేడారం మహాజాతరకు సంబంధించిన పోస్టర్ ను రేవంత్ రెడ్డి ఈ రోజు శాసనసభలోని సిఎం ఛాంబర్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సహచర మంత్రులు, గిరిజన పెద్దలు, పూజారులతో కలిసి ముఖ్యమంత్రి ని మహా జాతరకు ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, నాగరాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, మరియు గిరిజన పెద్దలు, పూజారులు తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
