Home South Zone Andhra Pradesh 7 న సిద్ధార్థ స్వర్ణోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

7 న సిద్ధార్థ స్వర్ణోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

0
0

7న సిద్ధార్థ స్వర్ణోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు

విజయవాడ, జనవరి 5 : ఈ నెల 7న సాయంత్రం విజయవాడ మొఘల్రాజపురంలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే సిద్ధార్థ అకాడమి ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్వర్ణోత్సవాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని, కేంద్రమంత్రి కె. రామ్మోహననాయుడు విశిష్ట అతిథిగా విచ్చేస్తారని సిద్ధార్థ అకాడమి అధ్యక్షులు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి.

పి.బి. సిద్ధార్థ కళాశాల కన్వీనర్ నిమ్మగడ్డ  లలితప్రసాద్ తెలిపారు. సోమవారం కళాశాలలోని వెబినార్ హాలులో వారు విలేకరులతో మాట్లాడుతూ 1975లో 250 మంది వదాన్యులైన ప్రముఖులు అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు విజయవాడలో నెలకొల్పిన సిద్ధార్థ అకాడమి, పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఉయ్యూరులో ఏజీ అండ్ ఎస్‌.జి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు 18 విద్యాసంస్థలుగా ఎదిగాయన్నారు.

సిద్ధార్థ విద్యాసంస్థల అభివృద్ధికి ఎంతో కృషిచేసిన 8 మంది ప్రధాన దాతలను ఆరోజున కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో సత్కరిస్తామని చెప్పారు. సిద్ధార్థ స్వర్ణోత్సవాలను గత ఏడాది మార్చి 7న అప్పటి యూజీసీ ఛైర్మన్  ప్రారంభించారని చెప్పారు. స్వర్ణోత్సవాల్లో భాగంగా గత పది నెలలుగా సిద్ధార్థ విద్యాసంస్థలలో పలు సదస్సులు, సమావేశాలు, పోటీలు, సినీ సంగీత విభావరి, వైద్య,విజ్ఞానశాస్త్ర ప్రదర్శనలు.

ఆర్బీఐ పూర్వ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తదితరులతో అతిథి ఉపన్యాసాలు తదితర ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు ఉపాధికి దోహదపడే కొత్తకోర్సులు ప్రవేశపెడుతూ ఉన్నత విద్యకు అకాడమీ ఊతమిస్తోందన్నారు. ఈ ఐదు పదుల సుదీర్ఘ ప్రస్థానంలో విజయవాడను విద్యాకేంద్రంగా సిద్ధార్థ అకాడమీ మలచిందన్నారు. విజయవాడను సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేయడంలో సిద్ధార్థ అకాడమి కీలక భూమిక పోషించిందని.

అనుబంధ విభాగంగా సిద్ధార్థ కళాపీఠం ఏర్పాటుచేసి దేశం నలుమూలల నుంచి సుప్రసిద్ధ కళాకారులను విజయవాడకు ఆహ్వానించి ఎన్నో శాస్త్రీయ సంగీత, నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు వెల్లంకి నాగభూషణం, జాయింట్ సెక్రటరీ సూరెడ్డి విష్ణు కూడా పాల్గొన్నారు.

NO COMMENTS