మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి లో CSB బ్యాంకు నూతన శాఖను బ్యాంకు యాజమాన్యం ఏర్పాటు చేసింది. బ్యాంకు యాజమాన్యం ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సోమవారం ముఖ్య అతిథిగా హాజరై నూతన శాఖను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభోత్సవం చేసి యాజమాన్యానికి, బ్యాంకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపి, కస్టమర్లకు నాణ్యమైన సేవలతో పాటు, తోడ్పాటు అందించి కస్టమర్ల అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు జోనల్ హెడ్ రవి, క్లస్టర్ హెడ్ శ్రీనివాస్, మేనేజర్లు జ్యోత్స్న, శ్యామ్ సుందర్ తదితరులు ఉన్నారు.
#sidhumaroju




